5832) నా కోసం ప్రాణం పెట్టిన నా స్నేహితుడా

** TELUGU LYRICS **

నా కోసం ప్రాణం పెట్టిన నా స్నేహితుడా 
ప్రేమతో నన్ను పిలిచినా నా యేసయ్య 
నీకే స్తోత్రము - నీకే వందనం 
నీకే స్తోత్రము - నీకే వందనం 

ఎవరు లేక ఒంటరినై తిరిగే సమయంలో 
నేనున్నానని పిలిచినా నా స్నేహితుడా 
||నీకే స్తోత్రము||

అంధకార లోయలో నే తిరిగే సమయంలో 
నేనున్నా అని పిలిచినా నా స్నేహితుడా 
||నీకే స్తోత్రము||

నా యేసయ్య నా ప్రభువా నీవున్నావని 
నీలో ఐక్యత కలిగి నడువ కృప చూపించితివి 
||నీకే స్తోత్రము||

--------------------------------------------------
CREDITS : Lyrics : Pas Paul Raju
Tune : David Joel Nethala 
Vocals : Dhanya Tryphosa
--------------------------------------------------