** TELUGU LYRICS **
నా కోసం నీ ప్రాణం
ఎందుకలా ఇచ్చావు (2)
నీవు మాట ఇచ్చావనా
నీవు మనస్సు ఇచ్చావానా (2)
దేవ ఎంత ప్రేమయ్య నా యేసయ్య
అర్హత లేదయ్యా యోగ్యుని కానయ్య (2)
నా రోగం భరించి
నా వ్యసనం సహించి (2)
దోషమంతా నాది కదా
నా కొరకే నీవు నలిగిత్తవా
నా శిక్ష నీపై పడిన
నీవు నోరు తెరవకున్నావు (2)
మౌనంగా ఉన్నావు
మౌనముగా ఉన్నావు
||ఎంత ప్రేమయ్య||
నా పాపం మోసితివి
అన్యాయం పొందితివి (2)
వేదనతో భారమైన
చూసి తృప్తి పొందితివి
నీ ప్రాణము ధారపోసి
పరిహారము చేసినావు (2)
శుద్ధునిగా చేసావు
నిర్దోషిగా మార్చావు.
||దేవా ఎంత ప్రేమయ్యా||
--------------------------------------------------------------------------------
CREDITS : Tune, Vocals : Pas. Samuel Paul Rowthu
Lyrics & Music : Nathanael & Joshi Madasu
--------------------------------------------------------------------------------