5840) నా జీవిత కాలమంతా నిన్నే స్తుతియించెదా

** TELUGU LYRICS **

నా జీవిత కాలమంతా నిన్నే స్తుతియించెదా 
నేను బ్రతుకు దినములంతా నిన్ను నేను చాటెదా (2)
ఆరాధనా ఆరాధనా (4)
||యేసు||

నా జీవిత పయనములో మలుపులెన్నో వచ్చినా        
అనుకోని ఆపదలే నన్ను చుట్టుముట్టినా (2)
ఇమ్మానుయేలువై నన్ను నీలో దాచితివే (2)
నా పక్షమై నిలచి నన్ను ఆదరించితివే (2) 
||ఆరాధన||

అపవాది బాణములే నన్ను బాధించినా -
ఆశలన్నీ కోల్పోయి నిరాశలో మునిగినా (2)
ఆశ్చర్యకరుడవై - నన్ను ఆదుకొంటివే (2)
ఆనంద మయముగా నన్ను మార్చి వేసితివే (2) 
||ఆరాధన||

అయినవారందరు నన్ను విడిచి వెళ్లినా 
ఆదరించు వారే లేక ఒంటరినై మిగిలినా (2)
నా కన్న తండ్రివై నన్ను చేరదీసితివే (2)
కలనైన మరువ లేని - కార్యాలు చేసితివే (2)
||ఆరాధన||

-------------------------------------------------------------
CREDITS : Vocals : Sis. Sandhya Daniel  
Lyrics, Tune : Pastor Daniel  
Music : Bro. Immi Johnson  
-------------------------------------------------------------