5818) నా చిన్ని ప్రార్థనలు నా చిన్ని కోరికలు అలకించి ఒక్కటి తీర్చావు

** TELUGU LYRICS **

నా చిన్ని ప్రార్థనలు 
నా చిన్ని కోరికలు
అలకించి ఒక్కటి తీర్చావు (2)
అడిగిన వాటికంటె - ఊహించిన దానికంటె (2)
అధికముగ నను దీవించావయ్యా
వర్ణింపలేని సంతోషాన్నిచావయ్యా (2)
||నా చిన్ని||

శాశ్వత ప్రేమ నాకు చూపినావయ్యా 
ప్రార్ధన శక్తి నాకు నేర్పినావయ్యా (2)
కనిటిని నాట్యముగా మార్చినావయ్యా 
నా దుఃఖ దినములు తీర్చినావయ్యా (2) 
||నా చిన్ని||

క్రుంగియున్న నను దైర్యపరచినావయ్యా
నిత్య జీవము నాకోసగినావయ్యా (2)
 నా జీవితమును తృప్తిపరచినావయ్యా 
ఊహించలేని కృపతో నడిపినావయ్యా (2)
||నా చిన్ని||

------------------------------------------------------------
CREDITS : Music : Stanley Sajeev
Lyrics, Tune, Vocals : Samy Pachigalla 
------------------------------------------------------------