5817) నా ధైర్యమా నా బలమా నీ రెక్కలా నీడలో

** TELUGU LYRICS **

నా ధైర్యమా నా బలమా నీ రెక్కలా నీడలో 
నేను నివసిస్తూ ఉన్నాను స్తోత్రార్హుడా
తలదాచి ఉన్నాను మహిమార్హుడా
నేనేమి కలవరపడను నేనేమి భయపడను 
నేనేమి దిగులేచెందను నేనేమి కృంగిపోను

పరిచయులే విరోధులై పగపట్టుచున్నారు
ఒంటరినైన నాపై మడిమెత్తుచున్నారు
నీ పాదపరిచారకుని పక్షమై నిలిచావు
నా ప్రత్యర్థికి పాఠాలు నేర్పావు

నీ సేవలోని పరిస్థితులు వ్యతిరేకమైనను
అల్పుడనైన నాపై దాడిచేస్తూ ఉన్ననూ
పాడైన స్వాస్థ్యమును బాగుచేయడానికి
ప్రతికూలతను అనుకూలపరచితివి

నీ యాజకునిగా ఎన్నుకొని 
నీ కృపను చూపావు
మరణము వరకు నీకు బానిసనై ఉందును
నీ వాక్య ప్రత్యక్షతతో బలపరచుచున్నావు
అపవాదికి నన్ను ప్రశ్నగా నిలిపావు

---------------------------------------------------------
CREDITS : Music, Tune : Daniel John
Lyrics, Vocals : Bro. Prakash Garu 
---------------------------------------------------------