5799) మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరిచిపోవునా

** TELUGU LYRICS **

మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరిచిపోవునా
నిన్ను దీవిస్తాను అన్నవాడు దీవించకమనున 
నీ కన్నుల పొంగిన కన్నీరు తనకవిలలో దాచిన దేవుడు
నీ పగిలిన హృదయపు వేదమను మరచిపోవునా  
నమ్ముట నీవలనైతే సమస్తమూ సాధ్యమేగా
చితికిన నిస్థితిలో చిరునవ్వుతో నింపునుగా

ఆస్తి ఎంతో ఉన్నను - వారసూడే లేక 
వేదనతో నిలిచిన అబ్రహమును చూడము
ఆశలే కోల్పోయి - శరీరమే ఉడికిన - అవమానాలెన్నో ఎదుర్కొన్నాను
మాట్లాడే దేవుడే - మౌనముగా నిలిచేనా
ఎండిన స్థితిలో - జీవముతో నింపేగా
వెచ్చిఉన్న దినములు వ్యర్థములైపోయేన
లెక్కకు మించిన సంతానమును పొందెగ

కుటుంబమే ఉన్నాను - కుటికే కరువై 
వేశ్యగా నిలిచిన రహాబును చూడుము
అడుగడుగున అవమానాలే - గుండెలో గాయాలై 
అవసరానికే అటబొమ్మగ మిగిలిన
చూచుచున్న దేవుడే చులకనగా చుచేన 
ఘోరపాపివంటు విడచిపోలేదుగా
పరిశుద్దుని వంశములో స్థానమునే ఇచ్చేనుగా
ఘోరపాపి అయిన తనప్రేమతో కడిగేనుగా

వాగ్దానమే ఉన్నాను - పయనమే భారమై
ఎడారిలో నిలిచిన మోషను చూడము
శత్రువే తరిమిన సంద్రమే ఎదురైనా
ఏదారోతెలియక  పయనమే ఆగినపయనమే అగిన 
ఇజ్రాయెల్ దేవుడే ఇరుకున విడిచేన 
మహిమనే చూపి - మార్గమై నిలిచేగా
నా సన్నిధి తోడని రెక్కలపై మోసేనుగా
శ్రేమనోందిన ఏళ్లకొలది సమృద్ధితో నిం పెనుగా

------------------------------------------------------------------
CREDITS : Music : Sudhakar Rella
Vocals : Bro.Chinny Savarapu 
Lyrics, Tune, Vocals : Pastor.David Varma
------------------------------------------------------------------