** TELUGU LYRICS **
నీ సేవలో నన్ను తరియించనీ
నీ ప్రేమలో నన్ను జీవించనీ
ఆధారమా అనురాగమా నిన్నే స్తుతించి కొనియాడెదా
నా జీవమా జయగీతమా నిన్నే స్మరించి స్తుతిపాడెదా
యేసు నీలో నే సాగెదా
నీ ప్రేమలో నన్ను జీవించనీ
ఆధారమా అనురాగమా నిన్నే స్తుతించి కొనియాడెదా
నా జీవమా జయగీతమా నిన్నే స్మరించి స్తుతిపాడెదా
యేసు నీలో నే సాగెదా
జీవితాన సోలిపోయా - చేరదీసి దయచూపవా
హోరుగాలి సాగరాన - చేయి చాపి దరిచేర్చవా
వేచివున్నా నే ఆశతో - బలము నింపు నీ ఆత్మతో
ఏకమై నా తోడుగా - భయము లేదు నీవుండగా
ఎదలో భారం మోసినావు - ఎంత ప్రేమ నా యేసయ్య
ఈ జగాన నీడ నీవై - కాచినావే కరుణాత్ముడా
ఎన్నడైనా వీడలేదే - మార్పులేని మహనీయుడా
చేరదీసే నీ స్నేహము - ఎదురుచూసే నా కోసము
నీ కృపా నా క్షేమము - మధురమైన సంకల్పము
నడిపే నన్ను నీదు కాంతి - ఎల్లవేళ నా యేసయ్య
---------------------------------------------------
CREDITS : Lyrics : Joshua Shaik
Music : Pranam Kamlakhar
Vocals : Srisha Vijayasekar
---------------------------------------------------