5871) కన్నీళ్ళే ఖాయమని శ్రమలతో సహవాసమని

** TELUGU LYRICS **

కన్నీళ్ళే ఖాయమని - శ్రమలతో సహవాసమని
ఇంకెంత కాలం ఈ బ్రతుకని - భీతితో ఉన్నావా?
నీ కన్నీళ్ళన్నీ కవిలలో దాచి - శ్రమలలో నీ తోడై ఉండి
ఊహకు మించిన కార్యములన్నీ - నా యేసు చేయును
విశ్వసించుము - నిరీక్షణ కలిగి ఉండుము
నీ జీవితమే మలుపు తిరుగునని 

నెమ్మదినిచ్చే నమ్మకమైన దేవుడుండగా
చేయి విడువని ఇమ్మానుయేలు
నీ సమీపమునుండగా
భీతి చెందకుము
భారము కలిగి ప్రార్ధన చేయుము
సంకోచించుట మాని స్తుతి చేయుము

----------------------------------------------------------
CREDITS : Music : Sudhakar Rella
Lyrics , Tune, vocals : Tinnu Thereesh
----------------------------------------------------------