** TELUGU LYRICS **
కలువరి గిరిమీద - సిలువలో నా యేసు
పలికిన ఆ ఏడు - మాటలెలా మరువగలను! (2)
కలువరి గిరిమీద - సిలువలో నా యేసు!
పలికిన ఆ ఏడు మాటలెలా - మరువగలను!
తండ్రీ తండ్రీ వీరేమి - చేయుచున్నారో!
వీరెరుగరని క్రీస్తు - క్షమియించమనినాడు!
పలికిన ఆ ఏడు - మాటలెలా మరువగలను! (2)
కలువరి గిరిమీద - సిలువలో నా యేసు!
పలికిన ఆ ఏడు మాటలెలా - మరువగలను!
తండ్రీ తండ్రీ వీరేమి - చేయుచున్నారో!
వీరెరుగరని క్రీస్తు - క్షమియించమనినాడు!
||కలువరి||
నేడు నాతో కూడా - పరదైసులోన
నీవును ఉందువని - వాగ్దానం చేశాడు (2)
అమ్మా ఆ.. ఆ.. అమ్మా
అమ్మా ఇకమీదట ఇతడు నీ తనయుడు
నీవు అతని మాతృమూర్తి అన్నాడు (2)
||కలువరి||
ఏలీ ఏలీ లామా సబక్తానీ అని
బాధతో ఒకే కేక వేశాడు
దప్పికొనుచున్నాను దేవా దేవా దేవా
దప్పికొనుచున్నాను దేవా
ఉపశాంతి సమకూర్చమని కోరినాడు (2)
||కలువరి||
సమాప్తమైనదని సర్వమనుచు
తలవంచి ఆత్మార్పణ చేసినాడు (2)
తండ్రీ తండ్రీ
తండ్రీ నా ఆత్మను నీ చేతిలో ఉంచుచున్నానని
పలికినాడు క్రీస్తు పలికినాడు (2)
||కలువరి||
------------------------------------------------------------------
CREDITS : Vocals : Rev Anand Kumar Alli
Music : Prashanth Penumaka
------------------------------------------------------------------