5860) ఎంత ప్రేమ నీది యేసయ్యా ఎంత ప్రేమ నీది యేసయ్యా

** TELUGU LYRICS **

ఎంత ప్రేమ నీది యేసయ్యా 
ఎంత ప్రేమ నీది యేసయ్యా
నన్నెంతగానో నీవు ప్రేమించి 
నన్నింతగ నిలువబెట్టినావు యేసయ్యా

సమస్యలెన్నో అలలవలే ఎగసి పడినా సముద్రమే ఉప్పెనై ముంచజూచినా
భయము లేదు నీకని దిగులు చెందవలదని నేనున్నానన్నావు ప్రేమతో 
భయము లేదు నీకని పైకి లేపి నన్ను నేనున్నానన్నావు ప్రేమతో

నా అన్నవారే వంచించి కీడు చేసినా అన్యాయమైన మాటలతో కృంగదీసినా
భయము లేదు నీకని నీ పక్షమే నేనని నేనున్నానన్నావు ప్రేమతో 
న్యాయకర్త నేనని ధైర్యమొందు నీవని నేనున్నానన్నావు ప్రేమతో

నా ప్రియులే పగవారై హింసించినా నా నీతినే హేళనగా కించపరిచినా 
భయము లేదు నీకని కలత చెందవలదని నేనున్నానన్నావు ప్రేమతో 
సృష్టికర్త నేనని విమోచించి నన్ను నేనున్నానన్నావు ప్రేమతో

---------------------------------------------------------------------------------------
CREDITS : 
--------------------------------------------------------------------------------------