5855) ఆశ్రయించితిని దేవా నీ సన్నిధిని ఆలకించు దేవా నా ప్రార్థనలు

** TELUGU LYRICS **

ఆశ్రయించితిని దేవా నీ సన్నిధిని
ఆలకించు దేవా నా ప్రార్థనలు
నా రక్షణ కవచం యేసే - నా ఆశ్రయ దుర్గము యేసే

క్రీస్తు యేసే నిజ దేవుడని - విశ్వాసముతో శరణు వేడితి
దేవుడే నాకు ఉన్న ఒక్క ఆధారమని
దేవుడే నా నమ్మదగిన సహాయమని 

కల్వరి గిరియే నా భాగ్యమని - అత్యాశక్తితో నే చూచితిని
సిలువయే నాకు ఉన్న ఒక్క నిరీక్షణని
సిలువ చెంతే నా పరిపూర్ణ విమోచనని

దేవాలయమే బలిపీఠమని నా సమస్తం సమర్పించితి
మందసమే నాకు ఉన్న ఒక్క ప్రార్ధన ధ్వజమని
కరూణాపీఠమే నాకు ఉన్న కృపాసనమని

------------------------------------------------------------
CREDITS : Music : Bro. Avinash Ansel
Vocals, Lyrics : Sis Sangeetha Paul
------------------------------------------------------------