** TELUGU LYRICS **
ఏ పాటి అర్హత లేని నన్నెంచుకున్నావు నీవు
ఏ మాత్రమూ పాత్రుడ కానీ నన్నాదరించావు నీవు
నా దోషములకై నీ రుధిరమునే యాగముగా చేసినావు
ఈ పాపి కొరకై నీ ప్రాణమునే బలిగా అర్పించినావు
వర్ణించలేనయ్యా నీ జాలినీ
వివరించలేనయ్యా నీ కరుణను
నీ గాయాలను మరి రేపినా - చేదు చిరకను త్రాగనిచ్చినా
నిన్నెంతగానో భాదించినా
నా తలంపులతో నిను శిలువ వేసినా
కౌగలించావు నా తోడుగ ఉన్నావు
నను చేరదీసి నను చేర్చుకున్నావు (2)
ఏమివ్వగలను ఆ త్యాగానికై
నాకెవరివ్వగలరయ్యా నీ ప్రేమను (2)

||ఏ పాటి||
వధకు తేబడిన గొఱ్ఱె పిల్లవై మౌనముగా నున్నది నా కొరకే కదా
మరణ పాత్రుడనైయున్న నాకై మరణపు ముల్లును విరచిన దేవా
నీ చేయి చాచావు నను లేవనెత్తావు
నను దాసుని కాక వారసుని చేసావు

-------------------------------------------------------------
CREDITS : Music, Vocals : Moses Dany
Lyrics, Tune : Pas. Titus & Sabitha
-------------------------------------------------------------