5718) వాడబారని మహిమ కిరీటం పొందుట కొరకే పొందుట కొరకే నా ప్రయాస

** TELUGU LYRICS **

వాడబారని మహిమ కిరీటం పొందుట కొరకే పొందుట కొరకే నా ప్రయాస
మహిమ గలిగిన రాజ్యములోనే చేరుట కొరకే చేరుట కొరకే నా ప్రయాస
అ.ప : యేసయ్య నీవేగా నాకు ఉన్న ఆశ్రయం (2) 
నీలోనే నాకు ఆనందమ (2) 

లోకపుమాయలు నను చుట్టుముట్టిన
బలహీన శరీరం వెనకకు లాగిన (2) 
వాస్తవమైన జీవము కొరకై  (2) 
గురివైపే నేను పయనించెదను (2)  
||యేసయ్య||

యెటుబోయినను శ్రమలే కలిగెను
వెలుపట ఎన్నో పోరాటములు (2) 
నా ఎదుటనున్న బహుమానముకై (2) 
నిందలు శ్రమలు సహియిOచెదను (2)  
||యేసయ్య||

ఉన్నతమైన పిలుపుకు లోబడి 
ఓపిక కలిగి పరుగెత్తెదను (2) 
కడబూర ధ్వని నా చెవిని చేరగా (2)  
నా ప్రభు చెంతకు ఎగిరి వెళ్ళిపోతాను (2) 
||యేసయ్య||

---------------------------------------------------
CREDITS : Music : Prashant
Vocals : Sis.Sangeetha Paul
Lyrics, Tune : Bro.Gunaveer paul
---------------------------------------------------