5733) వేసారి పోయానయ్య ఈ లోక ఆశలు వెంటాడగ

 

** TELUGU LYRICS **

వేసారి పోయానయ్య ఈ లోక ఆశలు వెంటాడగ 
వసివాడి పోయానయ్యా పలుమార్లు నన్ను శోధించిగ  
ఆశలు వెంటాడిన కోరిక నను తరిమినా
నీ రక్షణ కోటలో నను దాచివుంచినావయ్యా

శోధనలో వేధనలో నా బ్రతుకే సాగుచుండగా 
నా వారే పగవారై నాపైనే నిందవేస్తుండగా (2)
నా చింతను తీసి నా నిందను మొసి 
నా చెంతకు చేరి నను దైర్యపరచిన/ దైర్యపరచి
నా బాహువై నను ఆదరించినావయ్యా

చీకటిలో వెలుతురుగ నా వెంటే నీవు నడిచావయ్యా
వాక్యమనే ఖడ్గముతో ప్రతి దినము సరిచేసావయ్య
సత్యముతో సంధించి సంకటములు తోలగించి 
నా నడకను/ నడతలు సరిచేసి నీ త్రోవలో నన్ను నిలిపి
సంహర దూత నుండి తప్పించినావయ్యా

---------------------------------------------------
CREDITS : Music : Bro. Vinay
Vocals : Sis Boyi Prabha
Lyrics, Tune : Bro. Ravi Jackson  
---------------------------------------------------