5734) నే బ్రతికి ఉన్నను మరణించినను నే నిలచి ఉన్నను పడిపోయినను

** TELUGU LYRICS **

నే బ్రతికి ఉన్నను మరణించినను 
నే నిలచి ఉన్నను పడిపోయినను 
అనుదినము అనుక్షణము నా తోడుగా 
ప్రతి ఘడియా ప్రతి నిమిషం నా నిడగా
అ.ప: నాకు నీవు ఉన్నావు నా యేసయ్య
నాలో నీవు ఉన్నావు నా యేసయ్య 

అంత కోల్పోయి అణగారిన గాని 
లేవలేని స్థితిలో నేనున్నగాని
నడవలేక అడుగులు తడబడిన గాని 
హృదయమంత గాయాలతో నిండిన గాని

కెరటాలు ఎగసి పడినాగాని 
సముద్రము ఉప్పొంగి లేచిన గాని 
కారు చీకటులె కమ్మిన గాని 
సాతాను నన్ను శోధించిన గానీ

లోకమంత నన్ను విడచి మరచిన గాని 
లోకువగా చూసి గేలి చేసిన గాని 
చేసిన మేలుకు కీడు వచ్చిన గాని
కన్నీళ్లను కానుకగా ఇచ్చిన గానీ

------------------------------------------------------------
CREDITS : Music : Dr. A.R.Stevenson
Lyrics, Tune, Voice : Rajinikanth
------------------------------------------------------------