** TELUGU LYRICS **
నిర్దోషమైనది నిష్కలంకమైనది(2)
మనుషులలో ఆ దూతలలో లేనేలేనిది (కానేరానిది) (2)
యేసు రక్తము - పరిశుద్ధ రక్తము
యేసు రక్తము - అది దైవ రక్తము (2)
||నిర్ధోషమైనది||
ఏ నరుని రక్తమైన పాపములను కడుగగలదా?
ఏ నరుని రక్తమైన దోషములను బాపగలదా? (2)
పాపాలనే కడిగి శాపలనే బాపి (2)
పరిశుద్ధ పరచును నా యేసు రక్తము
||యేసు రక్తము||
ఏ నరుని రక్తమైనా రోగములను స్వస్థాపరచేనా?
ఏ నరుని రక్తమైనా దయ్యములను పారద్రోలేనా? (2)
రోగాలకే జయము దయ్యాలకే భయము (2)
కలిగించు రక్తము నా యేసు రక్తము
||యేసు రక్తము||
ఏ నరుని రక్తమైనా మనస్సాక్షిని శుద్ధి చేసేనా?
ఏ నరుని రక్తమైనా మన బుద్ధిని మార్చగలిగేనా? (2)
మనసాక్షికీ శుద్ధి మన బ్రతుకులో బుద్ధి (2)
కలిగించు రక్తము నా యేసు రక్తము
||యేసు రక్తము||
---------------------------------------------------------------------------------------
CREDITS : Shalem Raju Raru Thandri sannidhi ministries
--------------------------------------------------------------------------------------