5748) సర్వోన్నతుడా సర్వాధికారి స్వరమెత్తి నిన్ను కీర్తింతునయ్యా

** TELUGU LYRICS **

సర్వోన్నతుడా సర్వాధికారి 
స్వరమెత్తి నిన్ను కీర్తింతునయ్యా 
సర్వోన్నతుడా సర్వాధికారీ 
గళమెత్తి నిన్ను ఘనపరతునయ్యా 
నీ చిత్తమున్ నాకై ఏర్పరిచినావు 
నీ బాహువున్ చూపి బలపరచినావు 
స్తుతియించకుండా నేనుండలేను (2)

ప్రియమార నీ ప్రేమన్ నే పొందకుంటే 
నేనుండలేను జీవించలేను (2)
నీ సత్య వాక్యం గ్రహియింపకుండా 
నా అతిక్రమములు నే విడువకుండా 
దేవా నీ కనికరం నే పొందలేను 
||సర్వోన్నతుడా||

మనసారా మలిచావు నీ రూపమందున 
ప్రధాన శిల్పి నిను మరువలేను (2)
నా వృద్ధి నీవే - సమృద్ధి నీవే
నా సిద్ధి నీవే - పరిశుద్ధత నీవే 
నా మట్టుకైతే - బ్రదుకుట క్రీస్తే 
బ్రదుకుట క్రీస్తే - చావైనా లాభమే
||సర్వోన్నతుడా||

కన్నులార చూచావు నా దీనస్థితిలో  
కనురెప్పై కాచావు నా దుస్థితిలో (2)
నీ నా మమునిచ్చి నీ ఆత్మతో నింపి
నీ బిడ్డగా మార్చే నీ ద్వారా తప్ప 
నీ సన్నిధాన నే నిలువలెను 
||సర్వోన్నతుడా||

-------------------------------------------------------------------------------------
CREDITS : Music : Krissanu Dutta
Lyrics : Manoharamma, Praveen Gorakala  
Vocals : Prashanth Kottagorakala, Mercy Kottagorakala
-------------------------------------------------------------------------------------