** TELUGU LYRICS **
ప్రేమ నన్ను ప్రేమించే ప్రేమ
ప్రేమ కోసమే నన్ను చేసిన దేవుని ప్రేమ
ప్రేమ కోసమే నన్ను చేసిన దేవుని ప్రేమ
నాలో తన జీవము నుంచిన ప్రేమ
నాకై సర్వము సమకూర్చిన ప్రేమ
పాపినైన నన్ను ఎంతో వెదికిన ప్రేమ
ప్రాణమిచ్చి నన్ను బ్రతికించిన ప్రేమ
అన్ని ప్రేమలకన్నా మిన్న అయిన ప్రేమా
నాలో ఉన్న సర్వమా ఇకనైనా ఆయన ప్రేమను కనుమా
క్రీస్తులో నన్ను చూసుకున్న ప్రేమ
నూతన సృష్టిగా నన్ను మార్చిన గొప్ప ప్రేమ
రోగి నైన నన్ను స్వస్థపరచిన ప్రేమ
నలిగిన హృదయమును సేదతీర్చిన ప్రేమ
శాపమైన నన్ను దీవెనగా చేసిన ప్రేమ
దేవుని చిత్తం నాలో నెరవేర్చిన ప్రేమ
||అన్నిప్రేమ||
నా కొరకైన ఈ ప్రేమ నన్ను ఎన్నుకున్నప్రేమ
ఈ ప్రేమ ఎప్పుడూ విడిపోని ప్రేమ
ఏడబాయని నీ కృపతో ప్రేమించే ప్రేమ
విడువకనన్నుఎప్పుడు నడిపించే ప్రేమ
నా కొరకైన ఈ ప్రేమ నన్ను ఎన్నుకున్నప్రేమ
ఈ ప్రేమ ఎప్పుడూ విడిపోని ప్రేమ
ఏడబాయని నీ కృపతో ప్రేమించే ప్రేమ
విడువకనన్నుఎప్పుడు నడిపించే ప్రేమ
---------------------------------------------------
CREDITS : Lyrics : Ps.Krupa Raju
Vocals : Ujwala Sandeep
---------------------------------------------------