5750) చీలలు కొట్టిన గాయములన్ ముద్దీడుచున్నాను ప్రేమతో

** TELUGU LYRICS **

చీలలు కొట్టిన గాయములన్ 
ముద్దీడుచున్నాను ప్రేమతో (2)

నా పాపములతో చంపితి (2)
రక్షకుడా నన్ను క్షమియించుమా
ముద్దీడుచున్నాను ప్రేమతో 

దక్షిణ హస్తపు గాయమా (2)
సౌందర్య దీప చిహ్నమా
ముద్దీడుచున్నాను ప్రేమతో 

కల్వరిగిరిపై చిందిన (2)
పవిత్ర రక్త దారమా
ముద్దీడుచున్నాను ప్రేమతో 

మానవ ప్రేమ చిహ్నమ (2)
పాపము బాపిన దైవమా
ముద్దీడుచున్నాను ప్రేమతో 

ముళ్లపై తిరిగిన పాదమా (2)
సిలువపై వాలిన దేహమా
ముద్దీడుచున్నాను ప్రేమతో 

లోక పాపమును బాపిన (2)
మా మంచి జేసు దేహమా
ముద్దీడుచున్నాను ప్రేమతో 

నా బదులుగ నీవే మరణించితివి
పరలోక భాగ్యము నాకిచ్చితివీ
ముద్దిడుచున్నాను ప్రేమతో 

ఇంతటి ప్రేమను చూపిన 
ఆ ప్రేమకు సాటిలేదయా
ముద్దిడుచున్నాను ప్రేమతో

-------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------