** TELUGU LYRICS **
నిరంతరం నీ సన్నిధిలో నన్ను నడుపుచున్నావు
నిరంతరం నీ ధ్యాసలోనే నన్ను దాచియున్నావు
శ్రేయస్కారుడా నా ఆరాధ్య దైవమా
పూజ్యనీయుడ నా శ్రీమంతుడా
కృవగల దేవా నా యేసయ్యా ఆరాధన
శ్రేయస్కారుడ అత్యున్నతుడ నా యేసయ్యా
నిరంతరం నీ ధ్యాసలోనే నన్ను దాచియున్నావు
శ్రేయస్కారుడా నా ఆరాధ్య దైవమా
పూజ్యనీయుడ నా శ్రీమంతుడా
కృవగల దేవా నా యేసయ్యా ఆరాధన
శ్రేయస్కారుడ అత్యున్నతుడ నా యేసయ్యా
సమస్తాన్ని నిర్మించి సమస్తాని సమకూర్చి
ముందుకే నడిపితివి మేలు కలుగచేసితివి
ఏడారంటి బ్రతుకులను తృప్తిపరిచినావయ్యా
పాపదోషమంతా తీసి ఘనపరిచినావయ్యా
ఏదైనా చేయగల సర్వశక్తిగల దేవుడు
ఏదైనా సమకూర్చే సర్వన్నతుడవు నీవు
మహిమగల దేవుడవు మహిమోన్నతుడవు నీవు
మహిమను విడిచి మాకై దిగివచ్చిన రారాజువు
నిన్న నేడు నిరంతరం మారానే మారవు
ఉన్నవాడు అనువాడవు నా ప్రియ తండ్రివి
ఆకాశం నీ సింహాసనం భూమి నీ పాద పీఠం
యుగయుగములు ఏలువాడ - నా యేసురాజా
జీవముగల దేవుడువు రోషముగల దేవుడువు
మహిమ నుండి అధిక మహిమకు నడిపించే దేవుడవు
కృప వెంబడి కృప చూపించి సంతృప్తినిచ్చితివి
అత్యున్నత స్థానమునిచ్చి ఆశీర్వదించితివి
శ్రేయస్కరుడా నా యేసయ్యా - ఆరాధన
సర్వోన్నతుడా సర్వశిక్తుడా - శ్రీకరుడా
---------------------------------------------------------------
CREDITS : Music : Sudhakar Rella
Lyrics, Tune, Vocals : Bro Abishek Daniel
---------------------------------------------------------------