5729) కృపా సింహాసనాసీనుడా ఇహపరములలో స్తోత్రర్హుడా

** TELUGU LYRICS **

కృపా సింహాసనాసీనుడా - ఇహపరములలో స్తోత్రర్హుడా
ప్రభావం మహత్యం బలసౌందర్యం నీవే (2)
నా ఆరాధనా - ఆనందము - ఆశ్రయము నీవేకదా (2)

నీ బలిపీఠము చెంతా - పిచ్చుకులకు నివాసము దొరికెను
నీ మందిరములోని మేలులచే - మేము తృప్తిపొందెదము (2)
నీ మందిరములో - నివసించువారు ధన్యులు
నిత్యము నిన్నే స్తుతియించెదరు

నీ సన్నిధిలో నాకు - సంపూర్ణ సంతోషము కలదు
నీ చల్లని చేతినీడలో నిత్యము సేదతీరెదను (2)
నీ సన్నిధిలో నివసించువారు భాగ్యవంతులు
నిత్యము నిన్నే సేవించెదరు

నీ జీవ మార్గములో - జీవింతును నీ సాక్షిగా
నీ మహా బాహుబలముతో సియోనుకు నడిపించెదవు (2)
నీ గుడారములో నివసించువారు శ్రేష్ఠులు
నిత్యము నిన్నే ఆరాధించెదరు

--------------------------------------------------------------
CREDITS : Lyrics :Pastor. Solomon Raju
Music : Jk Christopher & Daya babu 
--------------------------------------------------------------