5727) దేవుని గొర్రెవై దిగి వచ్చినావే నా పాప భారము తొలగించుటకు

** TELUGU LYRICS **

దేవుని గొర్రెవై దిగి వచ్చినావే 
నా పాప భారము తొలగించుటకు 
కల్వరి సిల్వ పై తలదించినావే 
నా దోష శిక్షను భరియించుటకు 
నా స్థానములో నిలుచున్నావే 
అవమానములేనో భరింయించావే 
నాకు బదులుగా మరణించావే 
నిత్య జీవము నాకిచ్చావే 

నేనే కదా ఆ ఘోర సిల్వకు కారణం 
నేనే కదా నా పాపమే కదా 
నా అవిధేయతతో పలు మారులు నీ గాయం 
రేపితినయ్య నజరేయుడా 
యెరుగలేదు ప్రభువా నీ ప్రేమ గుణం 
తెలియలేదు దేవా నీ కృప వారం 
మన్నించావా... ఆ... ఆ... ఆ...   
||నా స్థానములో||

నావంటివారేకదా నిను సిలువ వేయమని 
అప్పగించిన యూదా జనము 
నా లాంటివారెకదా నీ కాళ్ళ చేతులలో 
మేకులను గ్రూచ్చినవారు 
మౌనముగా అన్ని సహియించి
ప్రేమతో దొంగను కూడా క్షమియించి 
బలియైతివా... ఆ... ఆ... ఆ...
||నా స్థానములో||

-----------------------------------------------------------
CREDITS : Music : Dr. Jk Christopher
Vocals : Lilian Christopher
Lyrics, Tune : Dr. Pratapa Raju Moola
-----------------------------------------------------------