** TELUGU LYRICS **
నిరంతర స్తోత్రార్హుడా ప్రేమలో పరిపూర్ణుడా
కొనియాడెదను భజయింతును నా జీవితాంతము
ఘనుడు నీవేనయ్యా సర్వము నీవే యేసయ్యా
||నిరంతర||
కొనియాడెదను భజయింతును నా జీవితాంతము
ఘనుడు నీవేనయ్యా సర్వము నీవే యేసయ్యా
||నిరంతర||
సర్వజనులలో నీ కీర్తి నిరంతము పాడి స్తుతించెదను సకలము నీవే ఆరాధించ
నా గలము నీ మహిమకై వాడెదను
జీవమున్నది నీ పని కోసమే జీవింతును ఇల నిన్ను ఘనపరచ
||నిరంతర||
రజతోత్సవమే నీ సేవలో రవితేజుడా నాపై ప్రకాశించితివి
రాజ్యము నేలే రాజులకంటే ఘనమైన పనిలో స్థాపించితివి
నీ రాజ్య భారమును నా భుజముపై నిలిపితివి
నీ నామమును ఇల ప్రకటింప
||నిరంతర||
నీ రాజ్య భారమును నా భుజముపై నిలిపితివి
నీ నామమును ఇల ప్రకటింప
||నిరంతర||
ఏర్పరచుకునే నాటి సంకల్పము నేటివరకు కాచే నీ కృపలో
సీయోను చేరా స్థిరమైన వాంఛకు ఆత్మబలమే తోడాయేగా
సిగ్గుపడని జనముగా చేసితివి నీ సన్నిధిలో ఇలా ఎన్నటికీ
||నిరంతర||
సిగ్గుపడని జనముగా చేసితివి నీ సన్నిధిలో ఇలా ఎన్నటికీ
||నిరంతర||
-------------------------------------------------
CREDITS :
-------------------------------------------------