5706) నీవే నా బలమయ్య నీవే నా కోటయ్య

** TELUGU LYRICS **

నీవే నా బలమయ్య - నీవే నా కోటయ్య
నీవే నా ఆశ్రయమయ్య - నీవే నా కాపరివయ్య
నీ దయ లేనిదే నేనేమవుదునో
నీ కృప లేనిదే నేనేమవుదునో

ఆదియందే నన్ను నీలో చూచితివి - 
తల్లిగర్భములోనే నన్ను ఎన్నుకొంటివి
నీరూపులోనే నన్ను మలచితివి - 
నీ మహిమ కొరకే ఏర్పరచితివి
ఆ రోజు నాపై నీ కృప లేనిదే
ఈ రోజు నీ దయలో నేనిలలేనయ్య

నీ పిలుపు లేనిదే నేనేమవుదునో
నీ చిత్తము లేనిదే నేనేమవుదునో
యేసయ్యా నేనేమవుదునో
యేసయ్యా నేనేమవుదునో

నా పాపమే నన్ను నీకు దూరము చేసిన - 
నా దోషమే నన్ను మరణమునకే నడిపిన
నన్ను తిరిగి తెచ్చుటకు నీలో ఏకమవ్వుటకు ‌‌‌‌- 
నీకు నీవుగా నాకై బలమైతివి
ఆ రోజు నన్ను నీవు వెదకి వుండలేనిదే 
ఈరోజు నీతో కలిసుండలేనయ్య

నీ పిలుపు లేనిదే నేనేమవుదునో
నీ చిత్తము లేనిదే నేనేమవుదునో
యేసయ్యా నేనేమవుదునో
యేసయ్యా నేనేమవుదునో

నీ రక్తము లేనిదే నేనేమవుదునో
నీ యాగము లేనిదే నేనేమవుదునో
యేసయ్యా నేనేమవుదునో
యేసయ్యా నేనేమవుదునో
నీవే నా బలమయ్యా నీవే నా కోటయ్యా
నీవే నా ఆశ్రయమయ్యా నీవే నా కాపరివయ్యా 

---------------------------------------------------------------------
CREDITS : Music : Moses Dany
Lyrics, Tune, Vocals : Pas. David Livingstone
---------------------------------------------------------------------