** TELUGU LYRICS **
గుండెల నిండా బాధతో ఉన్న
వంటరి నేనై విలపిస్తున్న (2)
నా కన్నీరు తుడిచావు యేసయ్య
నా చేయి పట్టి నడిపావు యేసయ్య (2)
వంటరి నేనై విలపిస్తున్న (2)
నా కన్నీరు తుడిచావు యేసయ్య
నా చేయి పట్టి నడిపావు యేసయ్య (2)
నీవే నీవే నా ప్రాణం
నీవే నీవే నా సర్వం (2)
సాగలేని నా జీవిత పయనంలో
వెక్కి వెక్కి ఏడ్చేటి వేళలో (2)
నను ఓదార్చినావు - నాకు ఓర్పు నేర్పినావు (2)
తడబడుతున్న నన్ను స్థిరపరిచావు
||నీవే నీవే||
గురి లేని నా జీవిత గమనంలో
గమ్యం ఏది కానరాని ఘడియలలో (2)
నన్ను చూసినావు - నన్ను చేరదీసినావు (2)
నా చేయి పట్టి నన్ను నడిపించావు
||నీవే నీవే||
అండలేని నా ఒంటరి వేదనలో
ఎండమావిలాంటి ఆవేదనలో (2)
నన్ను కరుణించినావు - నీ కృపను చూపినావు (2)
నా తోడుగా నిలచి నన్ను బలపరిచావు
||నీవే నీవే||
--------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : K S Daniel
Music : Pradeep Sagar
--------------------------------------------------------