5745) నీ మందిరములో నీ పాదసన్నిధిలో ఒక్క దినము గడుపుట

** TELUGU LYRICS **

నీ మందిరములో నీ పాదసన్నిధిలో 
ఒక్క దినము గడుపుట ఎంతో శ్రేష్ఠము 
లోకములో సమయము గడుపుటకంటెను 
అ.ప 
నీవుండే చోటయా ఆనంద నిలయమయా
కలవరములు తొలగించే క్షేమ స్థలమయా 
యేసయ్యా నీ నివాసములు రమ్యమయా 

నీ ప్రసన్నతా దొరుకును 
సంపూర్ణ సంతోషమే లభించును 
నీ తేజో మహిమ నిలచును 
ప్రార్థనకు జవాబు దొరుకును 

నీ ఉపదేశం దొరుకును 
ఏ త్రోవను నడవాలో నేర్పించును 
నీ దర్శనమే లభించును 
అజ్ఞానము తొలగిపోవును 

నీ సన్నిధి బలము దొరుకును 
పరిశుద్ధుల సహవాసమే లభించును 
నీ కనుదృష్టియే నిలచును 
భయములన్నీ తొలగిపోవును

---------------------------------------------------------------
CREDITS : Vocals : Sis. Blessy Wesly
Lyrics, Tune, Music : Bro. Praveen Bandi
---------------------------------------------------------------