5746) మహిళా లోకమా ఆలోచించుమా స్త్రీల సమాజమా

** TELUGU LYRICS **

మహిళా లోకమా ఆలోచించుమా 
స్త్రీల సమాజమా యోచన చేయుమా (2)
ఆ దేవుని సన్నిధిలో నీ స్థానమేమిటో
ఈ లోకపు చట్రంలో నీ పాత్రయేమిటో (2)
ఆ సృష్టికర్త నిను సృష్టించుటకు కారణమేమిటో
మగువా... ఓ మగువా...
నీవు సాటియైన సహకారివా?
మగువా... ఓ మగువా...
బలహీనమైన ఘటానివా? (2)  
||మహిళా||

ముసలమ్మ ముచ్చట బెట్టే  - మూఢురాలువై ఉండక
నీ గృహమును ఆత్మతో కట్టే - యోగ్యురాలువై నిలువుమా 
ముసలమ్మ ముచ్చట బెట్టే  - మూఢురాలువై ఉండక
నీ గృహమును ఆత్మలో కట్టే - యోధురాలువై నిలువుమా 
కాలమునెరిగి నిధురమేలుకొ భారము కలిగి బ్రతుకుదిద్దుకో...
సిద్దేలోనూనెతో సిద్దపాటుతో కన్యకలను నీవు పొలినడుచుకో...
క్రీస్తేసుకు సాక్షివై - సమాజానికే మాదిరై (2)
మగువా... ఓ మగువా... నీవు సాటియైన సహకారివ?
మగువ... ఓ మగువ... బహినమైన ఘటానివ?

ప్రభు ఆత్మను శోధించుటకై
సమ్మతించే సప్పీరా
దైవ జనునికాతిథ్యమివ్వగా - సహకరించే ప్రిస్కిల్ల (2)
మంచిచెడులను నీవుతెలుసుకో ఏది శ్రేష్టమో నిశ్చయించుకో
హన్నాబ్రతుకును మాదిరిచేసుకో ప్రార్ధనతోనే విజయమొందుకో
నీ భర్తకు కిరీటమై - ప్రభు సేవలో సహాకారివై (2)
మగువా... ఓ మగువా...
నీవు సాటియైన సహకారివ?
మగువ... ఓ మగువ...
బలహీనమైన ఘటానివ?

----------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune: Mahesh Majji 
Music & Vocals : R. Prashanth & Grace Angel
----------------------------------------------------------------------