5744) సిలువంటే సులువు కాదు ఓ నేస్తమా యేసు చేసిన త్యాగాలన్నీ

** TELUGU LYRICS **

సిలువంటే సులువు కాదు ఓ నేస్తమా 
యేసు చేసిన త్యాగాలన్నీ మరువకుమా (2) 
నీ ప్రాణానికి నా ప్రాణం అంటారెందరో
రక్తం కావాలన్నా కనిపించరు ఎవ్వరూ (2) 
యేసులోని మంచి మనస్సును చూడవా 
నీ కొరకు ప్రాణమిచ్చెనని ఎరుగవా (2) 

సాటివారికి సహాయమేమీయు చేయలేని భూలోకంలో                          
మానవజాతికై ఎన్ని కష్టాలు యేసుక్రీస్తుకీ లోకంలో 
పట్టుకొని బంధించిన నేరమే మోపినా
అందరు అవమానించిన సిలువను తనపై మోపినా
కోపపడలేదు తిరుగబడలేదూ 
తన అనాది సంకల్పాన్ని మరచిపోలేదు
ఎవరికోసమో ఈ తలవంపూ 
నిను రక్షించాలని ఆయన తలంపూ

నీ మార్పు కోసము ఆ యేసు ప్రేమను చూపెను అందరిలో 
పాపము అంటని పరిశుద్ధ రక్తాన్ని చిందించెనుగా కలువరిలో
కొరడాలతో కొట్టినా ముళ్ళ కిరీటం పెట్టినా 
దూషిస్తూ మాట్లాడినా మోముపై వుమ్మేసినా
కోపపడలేదూ తిరుగబడలేదూ 
తన తండ్రి ఆజ్ఞను మరచిపోలేదూ
ఎవరికోసమో ఆ ఓర్పు నిను పరలోకం చేర్చాలని సహింపు 

ప్రతి పాపి కొరకు రక్తపు ముద్దగా వ్రేలాడేను సిలువమ్రానులో 
ప్రతి పాపులను ప్రేమించుచుండెను ప్రభు ప్రాణము పోవువరకు 
పిడికెళ్లతో గుద్దిన మేకులే దింపినా  
చేదు చిరక త్రాగించిన బల్లెముతో పొడిచినా
కోపపడలేదు తిరుగబడలేదూ 
తన వధించు గొర్రెపిల్లని మరువలేదు
ఎవరికోసమో ఈ బలియాగం ఎవరైనా చేశారా ఇంతటి త్యాగం

** ENGLISH LYRICS **

Siluvante Suluvu Kaadu O Nesthamaa
Yesu Chesina Tyaagaalanni Maruvakumaa (2)
Nee Praanaaniki Naa Praanam Antaarendharo
Raktam Kaavaalannaa Kanipincharu Evvaroo (2)
Yesuloni Manchi Manassunu Choodavaa
Nee Koraku Praanamichchenani Erugavaa (2)

Saativaariki Sahaayamemiyu Cheyaleni Bhoolokamlo
Maanavajaatikai Enni Kashtaalu Yesu Kreesthuki Lokamlo
Pattukoni Bandhinchina Nerame Mopinaa
Andaru Avamaaninchina Siluvanu Thanapai Mopinaa
Kopapadaledu Thirugubadaledu
Thana Anaadi Sankalpaanini Marachipoledu
Evarikosamo Ee Thalavampu
Ninu Rakshinchalani Aayana Thalampu

Nee Maarpu Kosamu Aa Yesu Premanu Choopenu Andarilo
Paapamu Antani Parishuddha Raktanni Chindinchenugaa Kaluvarilo
Koradaalatho Kottinaa Mulla Kireetam Pettinaa
Dooshisthu Maatlaadinaa Momupai Ummesinaa
Kopapadaledu Thirugubadaledu
Thana Thandri Aagnanu Marachipoledu
Evarikosamo Aa Oorpu Ninu Paralokam Cherchalani Sahimpu

Prathi Paapi Koraku Raktapu Muddagaa Vrelaadenu Siluva Mraanulo
Prathi Paapulanu Preminchuchundenu Prabhu Praanamu Povuvarku
Pidikellatho Guddina Mekule Dimpinaa
Chedu Chiraka Thraaginchina Ballemutho Podichinaa
Kopapadaledu Thirugubadaledu
Thana Vadhinchu Gorrepillani Maruvaledu
Evarikosamo Ee Baliyaagam Evaraina Chesaraa Inthati Tyaagam

----------------------------------------------------------------------------
CREDITS : Lyrics : Bro. Philliph Prakash
Vocals & Music : Bro.Paul & Bro. Samuel Morris
----------------------------------------------------------------------------