5758) నా యెడల జాలి చూపవా యేసయ్య నాతో నీవు మాట్లాడవా

** TELUGU LYRICS **

నా యెడల జాలి చూపవా యేసయ్య - 
నాతో నీవు మాట్లాడవా మెస్సయ్య (2)
నీకు దూరమైన ప్రతీ క్షణము నీవు -
నా దరిచేరి నన్ను కౌగిలించి నావూ (2)

కనికరమే లేక కరుణయే యెరుగక -
కటినముగా నేను శిక్షింపబడుచుండగ (2)
కరుణామయుడా నా కాపరిగ నిలచి -
కలుషమును కడిగి నను స్థిరపరిచావూ (2)

లోకమందు నన్ను వేరుపరచినావూ -
నీతి కిరీటం నాకు ధరియింపజేయ (2)
నా రక్షణకై నీవు బలియైతివా -
నా శిక్షను నీవు బరియించినావా (2)

నీవే నాకు ఆదారం నీతోనే ఆనందం -
దినదినము నిన్ను నే పొగడెదన్ (2)
నే జారిపోకుండా నాతో నడువుమూ
నిత్య జీవ మైనా నీ సన్నిధి కీ చేర్చుమూ

-------------------------------------------------
CREDITS : Lyrics, Tune : Vijaya 
Music : David Joshi 
Vocals : Bro Nissi John 
-------------------------------------------------