5753) కలువరిగిరిలో ప్రేమను చూపిన కలుషమే లేని కరుణామయుడా

** TELUGU LYRICS **

కలువరిగిరిలో ప్రేమను చూపిన 
కలుషమే లేని కరుణామయుడా (2)
నీ సిలువే ప్రేమే నాకు మార్గం
నే నిలిచి ఉండుటే జీవిత సాక్షం (2)

చిందియున్న రక్తపు ధారలలోన పాపాలు కడిగిన మహోన్నతుడా
వెలకట్టలేని పాపమునంత సిలువలో దాచిన తేజోమయుడా 

నీవే నీవే నా ఆశ్రయము
నీకే నీకే నా జీవితము
నిలిచియుందు నీకై నా దేవా

లోకములోని చీకటి త్రోలి చెదరిన గుండెకు దైర్యము నిచ్చి
మక్కువ చూపి అక్కున చేర్చి
నీ కౌగిలిలో నను చేర్చుకొని
రాజా రాజా నను మార్చితివే 
నీకే నీకే నా జీవితము
నిలిచియుందు నీకై నా దేవా

నేనుండవలసిన స్తానములోన నాకై 
నిలిచిన ప్రేమామాయుడా
నా దోషములను దీవెనగా మార్చి 
మార్గము చూపిన మహిమాన్వితుడా 
దేవా దేవా నా ఆనందము
నీవే నీవే నా సంతోషము
నిలిచియుందు నాకై నా దేవా

-------------------------------------------------------------------------------------
CREDITS : Lyrics & Music : King Saul & Pradeep Sagar
Vocals : Sis. Divya Angel, Angel, Swetha (Angel Sister)
-------------------------------------------------------------------------------------