5754) గొప్పదయ్య దేవా నీ ప్రేమ చాలా గొప్పదయ్య

** TELUGU LYRICS **

గొప్పదయ్య దేవా నీ ప్రేమ 
చాలా గొప్పదయ్య దేవా నీ ప్రేమ (2)
మరుగై యున్నదేదియు నీకు లేదు 
అన్నీ తెలిసే నన్ను చూస్తూ ప్రేమిస్తున్నావు 
మోసం చేస్తూ ఉన్నానని తెలిసి కూడా
చేతులు చాచి ఇంకా కనిపెడుతూ ఉన్నావు
ఎంత వింతగా ఉందయ్యా యేసు నీ ప్రేమ 
కొంతైనా నీలా నేనిలా మారాలయ్యా (2)
||గొప్పదయ్య||

నీ శక్తితో నన్ను నింపావు
అభిషేకించి పంపావు 
మృగములనైన గొలియాతైన 
యుద్ధం నాదే అన్నావు (2)
నా ఆశలకే లోబడిపోయి వ్యభిచారిగనే నిలిచాను 
నాకిచ్చిన అధికారాన్నే నే దుర్వినియోగం చేశాను
దుర్వినియోగం చేశానని తెలిసే నను ప్రేమించావు 
||ఎంత వింతగా ఉందయ్యా||

నీ వాడిగానే ఉన్నాను
నీ మాటలనే అన్నాను 
నీవిచ్చిన బాధ్యత చేపట్టి 
నిన్నే మోసం చేశాను (2)
బోధకుడా నీకే వెలకట్టి నిన్నే అమ్ముకున్నాను 
శుభమని చెప్పి ముద్దే పెట్టి నేనే అప్పగించాను 
నేనే అప్పగిస్తున్నానని తెలిసే నన్ను ప్రేమించావు 
||ఎంత వింతగా ఉందయ్యా||

-------------------------------------------------------------------
CREDITS : Music : Prem Kumar Vaddadhi
Lyrics, Tune, Vocals : Pastor Prabhu Kumar
-------------------------------------------------------------------