5697) హృదయాలనేలే రారాజు యేసువా అధరాలపై నీ పేరే కదలాడుతుండగా

** TELUGU LYRICS **

హృదయాలనేలే రారాజు యేసువా
అధరాలపై నీ పేరే కదలాడుతుండగా (2)
నీ కొరకే నేను జీవింతును
నా జీవితమంతా అర్పింతును 
||హృదయాల||

నా ప్రియులే శతృవులై నీచముగా నిందించి
నన్నెంతో తూలనాడి నా చేయి వీడగా (2)
నా దరికి చేరి నన్ను ప్రేమించినావా
నన్నెంతో ఆదరించి కృప చూపినావా
నా హృదయనాథుడా నా యేసువా
నా ప్రాణప్రియుడా క్రీస్తేసువా
||హృదయాల||

నీ హృదయ లోగిలిలోన నను చేర్చు నా ప్రియుడా
నీ ప్రేమ కౌగిలిలోన నను దాచు నా విభుడా (2)
పరలోక మార్గాన నడిపించు నా ప్రభు
అరణ్య యాత్రలోన నిన్నానుకొందును
అతిలోక సుందరుడా శ్రీ యేసువా
రాజాధిరాజా ఘన యేసువా
||హృదయాల||

--------------------------------------------
CREDITS : Akshaya Praveen
--------------------------------------------