5698) బలవంతుడ ననుకొంటిని బలహీనుడనని తెలసుకొంటిని

** TELUGU LYRICS **

బలవంతుడ ననుకొంటిని - బలహీనుడనని తెలసుకొంటిని
యోగ్యమైన వాడనుకొంటిని - అయోగ్యుడనని యెరిగియుంటిని
ఈ బలహీనుడిని కరుణించుము - నీ బలముతో నింపి నిలబెట్టుము
అయోగ్యుడను నన్ను రక్షించుము 
యోగ్యమైనవానిగా నను చేయుము
నన్ను కరుణించుము నన్ను నిలబెట్టుము
నన్ను రక్షించుము నన్ను సరిచేయుము
||బలవంతుడ||

నీతో నుండుటే - నీలో బ్రతుకుటే - నీతో నడచుటే - జీవితమని
నేనెరిగితి - ఎంతో మారితి - నీ సాక్షిగా నను నిలువనీ
నే దారితప్పిన పసివాడను - నీ ప్రియ హస్తముతో నను చేర్చుకో
నిను విడిచి వెళ్లిన వ్యర్ధుడిని నీ ఉన్నత ప్రేమతో నను హత్తుకో   
దేవా నను హత్తుకొ
నే పసివాడను దేవా నను హత్తుకో  నే వ్యర్ధుడను ప్రేమతో నను హత్తుకో
||బలవంతుడ||

సర్వేశ్వరా - శక్తివంతుడా - ప్రాణ నాదుడా - నా యేసయ్య
నీ త్యాగమే - నీ ప్రేమయే - చెదరిన నను - ఇలా మార్చెను
ఎన్నికయే లేని నా బ్రతుకును - ఏలికగా నన్ను మలచితివే 
వేదనతో నిండినా నా ప్రాణమున్ నిత్యానందముతో నింపితివే 
దేవా నా బ్రతుకును యేలికగా మలచితివే ప్రభువా 
నా ప్రాణమున్ నీ సేవలో నిలిపితివే సేవలో నిలిపితివే 

బలహీనుడనైన నన్ను ఈ నీ బలముతో నింపి నిలబెట్టితివే
అయోగ్యుడనైన నన్ను నీ యోగ్యవంతునిగా సరిచేసితివే
ఈ నా హృదయమును కాపాడుము ఇక పాపములోనికి పోనీకుము
నీ పరిశుద్ధత్మతో నను నింపు ఇక లోకములోన పడనీకుము

** ENGLISH LYRICS **

Balavanthuda Nanukontini - Balaheenudanani Thelasukontini
Yogyamaina Vaadananukontini - Ayogyudanani Yerigiyuntini
Ee Balaheenudini Karuninchumu - Nee Balamutho Nimpi Nilabettumu
Ayogyudanu Nannu Rakshinchumu - Yogyamaina Vaaniga Nanucheyumuu
Nanu Karuninchumu - Nanu Nilabettumu
Nanu Rakshimchumu - Nannu Saricheyumuu - Nanu Saricheyumuu
||Balavanthudanu||

Neetho Nundutey - Neelo Brathukutey - Neetho Nadachutey - Jeevithamani
Nenerigithi - Entho Maarithi - Nee Sakshiga Nanu Niluvanee
Ne Dhaarithappina Pasivaadanu - Nee Priya Hasthamutho Nanu Cherchuko
Ninu Vidachi Vellina Vyardhudanu - Nee Unnatha Prematho Nanu Hathukoooooo
Ney  Pasivaadanu - Deva Nanu Cherchukoo
Ney Vyardhudanu - Prematho Nanu Hathukoo - Deva Nanu Hathukoo
||Balavanthudanu||

Sarveshwara - Shakthivanthudaa - Prana Naadhuda - Naa Yesayya
Nee Thyagame - Nee Premaye - Chedharinananu - Ila Maarchenu
Ennikaye Leni Naa Brathuku - Elikaga Nannu  Malachithivey
Vedhanatho Nindina Naa Pranamun - Nithyanandhamutho Nimpithivey
Deva Naa Brathukunu - Elikaga  Malachithivey
Prabhuva Naa Pranamunn - Nee Sevalo Nilipithivey - Sevalo Nilipithivey
                                                            
Balaheenudanaina Nannu Ee - Nee Balamutho Nimpi Nilabedithivey
Ayogyudanaina Nannu Nee - Yogyavanthuniga Sarijesithivi
Ee Na Hrudhayamunu Kaapadumu - Ika Papamu Loniki Poneekumu
Nee Parishudhathmatho Nanu Nimpumu - Ika Lokamu Lona Padaneekumu

--------------------------------------------------------------------
CREDITS : Livingston Matte| Immi Johnson
--------------------------------------------------------------------