5699) చేయి విడువకు నా చేయి విడువకు నా చెంత చేరి ఓదార్చే

** TELUGU LYRICS **

చేయి విడువకు నా చేయి విడువకు
నా చెంత చేరి ఓదార్చే క్షణం మరువకు (2)
నా ఆశ నీవే - నా ద్యాస  నీవే ఆధారం - నీవే ఆరాధన నీకే (2)
||చేయి విడువకు||

నిదురే లేదు ఏ రాతిరిలో గాయములన్ని నను తొలచుచుండగా
నీదయ కొరకై ఆశతో నేను మెలకువ కలిగి ప్రార్ధించగా (2)
గాఢాంధకారమంత అలుముకున్ననూ - గమ్యము ఏమౌనో తెలియకున్ననూ (2)
నా ఆశ నీవే - నా ద్యాస  నీవే ఆధారం - నీవే ఆరాధన నీకే (2)
||చేయి విడువకు||

క్షణమొక యుగమై కాలం గడువగా కన్నీరే నాకు కాలక్షేపమాయెగా 
క్షేమము లేక స్వస్థత కొరకై వేదనతో నేను కృంగి యుండగా
శ్రమలో తోడు లేక ఒంటరినైనా - శిలనే కాక నేను మొరపెడుతున్న (2)
నా ఆశ నీవే - నా ద్యాస  నీవే ఆధారం - నీవే ఆరాధన నీకే (2)
||చేయి విడువకు||

---------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : Kishore Babu Thappeta
Music & Vocals : KY Rathnam & Anwesha
---------------------------------------------------------------------------