5696) నేను నెమ్మది పొందె స్థలము నా దేవుని మందిరం

** TELUGU LYRICS **

నేను నెమ్మది పొందె స్థలము నా దేవుని మందిరం
నాకు జవాబు దొరికే చోటు ఆయన బలిపీఠం
అ.ప : నెమ్మది నెమ్మది ఎంతో నెమ్మది అహా
నెమ్మది నెమ్మది ఆయన సన్నిధి
||నేను||

ఎంతో వేదనతో ప్రభు సన్నిధికి చేరగా
అంతే నెమ్మదితో నా హృదయము నింపెను
వాక్కుతో బలపరిచెను - స్తుతులలో జయమిచ్చెను
ధైర్యముతో నింపెను (2)

బలహీన సమయములో ప్రభు కోనేటినే చేరగా
వాక్య ప్రవాహముతో స్వస్థత కలిగించెను
వాక్కుతో బలమిచ్చెను - స్తుతులతో శక్తినింపెను
ఆదరణ నిచ్చెను (2)

దీనస్థితిలోన ప్రభు పాదములు చేరగా
క మందిర సమృద్ధితో నన్ను తృప్తిపరచును
గ వాక్కుతో సంధించెను స్తుతులతో స్థిరపరిచెను
సాక్షిగా నను నిలిపెను (2)

-----------------------------------------------------
CREDITS : Music : Avinash Ansel
Lyrics, Tune : Bro. Gunaveer Paul
-----------------------------------------------------