5762) ధన్యమాయెనయ్యా నా జీవితం నిన్ను నమ్మినందున నా యేసయ్యా

** TELUGU LYRICS **

ధన్యమాయెనయ్యా నాజీవితం
నిన్ను నమ్మినందున నా యేసయ్యా
ఏ యోగ్యత లేదు అర్హతయే లేదు
పిలిచితివేనన్ను నా యేసయ్యా (2)

అన్యురాలు రూతును ధన్యురాలు చేసావు
మోయాబు నుండి బేత్లేహేము చేర్చావు (2)
బోయజును కదిలించి ఆదరించావు (2)
(నీ) వంశావలిలో స్థానామునిచ్చావు (2)
నా తల్లియు నీవే నా తండ్రియు నీవే
నా దైవము నీవే నా యేసయ్యా

అన్యుడైన కోర్నేలిని ధన్యుడిగా చేశావు 
ప్రార్ధనలు ఆలకించి దర్శనాన్ని ఇచ్చావు (2)
పేతురును పిలిపించి నీవాక్కుతో నింపావు (2)
పరిశుద్దాత్మతో అభిషేకించావు (2)
నా  ధనము నీవే నా ఘనము నీవే
నా స్థితియునీవే నా యేసయ్యా

అనాథయైన ఎస్తేరును దన్యురాలు చేసావు
రాజుకి దయ కలిగించి రాణిగా మార్చావు (2)
యూదుల రక్షణకై ఉపవసింపచేసావు (2)
కీడును తొలగించి క్షేమమునిచ్చావు
నా రక్షణనీవే నా శిక్షణనీవే సంరక్షణనీవే నా యేసయ్యా (2)

ధన్యమాయెనయ్యా నాజీవితం
నిన్ను నమ్మినందున నా యేసయ్యా
ఏ యోగ్యత లేదు అర్హతయే లేదు
పిలిచితివేనన్ను నా యేసయ్యా (2)

---------------------------------------------------------------
CREDITS : Music : Sudhakar Rella
Vocals : Sudheer Sunny
Lyrics & Tune : Amara Kumari & Ratnam
---------------------------------------------------------------