** TELUGU LYRICS **
క్షమియించుమయ్యా ఓ యేసయ్యా
లెక్కకు మించిన నా పాపాలు
ఎనలేని నీ కృపను నాపైన చూపి విస్తార దోషాలను మన్నించయ్యా
లెక్కకు మించిన నా పాపాలు
ఎనలేని నీ కృపను నాపైన చూపి విస్తార దోషాలను మన్నించయ్యా
దినదినము నీ నుండి వేరైపోయి
పాపాల ఊబిలో కూరితినయ్యా
నీవిచ్చిన సమయాన్ని నిర్లక్ష్యం చేసి
నీవిచ్చిన సమయాన్ని నిర్లక్ష్యం చేసి
నిన్నెంతో ఆయాస పెట్టితి దేవా
||క్షమియించు||
నా త్రోవకు వెలుగైన నీ వాక్యము వీడి
ప్రార్థించే చేతులకు సంకెళ్ళు వేసి
శరీర నేత్రాసల బానిసనై
శరీర నేత్రాసల బానిసనై
ఎంతో డంబముతో జీవించితినయ్యా
||క్షమియించు||
మోసాలతో పైపై వేషాలతో
ఎందరినో మాటలతో నమ్మించితి
నాలోని కపటాన్ని దాచేసి
నాలోని కపటాన్ని దాచేసి
అందరిని వేలెత్తి చూపించితినయ్యా
||క్షమియించు||
నీవంటె భయభక్తులు వదిలేసినాను
నీవంటె భయభక్తులు వదిలేసినాను
నీవిచ్చు ఐశ్వర్యం కోల్పోయినాను
పలుమార్లు నీవు, నన్ను గద్ధించినా
పలుమార్లు నీవు, నన్ను గద్ధించినా
లోబడలేదయ్యా నను మన్నించయ్యా
||క్షమియించు||
||క్షమియించు||
---------------------------------------------------------
CREDITS : Lyrics : Pastor Joel D Raj
Tune : Sunil Yalagapati
Music : JK Christopher
---------------------------------------------------------