5756) భారమైన సిలువ తూలుతూ మోస్తూ సాగింది యాత్ర

** TELUGU LYRICS **

భారమైన సిలువ - తూలుతూ మోస్తూ 
సాగింది యాత్ర - కలువరి గిరికి 
ఏ దోషమెరుగని - ప్రభుకా ఈ ఘోరం 

ముళ్ళకిరీటం - శిరమున పెట్టి
వీపుపై కొట్టిరా - దేవ నిన్ను
మౌనివైయుంటివా - మా దోషములకై 

నిందలుమోపి - ముఖముపై ఉమ్మి 
హింసలుపెట్టిరా - దేవ నిన్ను
దూషించిన వారిని - క్షమీయించితివా

నీ రక్తముతో - పాపముకడిగి 
పాపికి మోక్షము - ఇచ్చిన దేవా 
మాకై సిలువలో - మరణించితివా

------------------------------------------------------
CREDITS : Lyrics D.J.R Jayakumar 
Tune, Music : Chinbab
------------------------------------------------------