5768) అర్పణ బలి అర్పణ యేసు నా కొరకు చేసిన ప్రేమార్పణ

** TELUGU LYRICS **

అర్పణ బలిఅర్పణ 
యేసు నా కొరకు చేసిన ప్రేమార్పణ
అర్పణ బలిఅర్పణ 
యేసు నాకొరకు చేసిన ప్ప్రాణార్పణ (2)

రక్తమే ప్రాణము - ఆ ప్రాణమే ధారబోసెను (2)
ఇంత గొప్ప ప్రేమ యేసు నాపై చూపెను 
ఎంతో శాశ్వతమైన కృపతో నన్ను నింపెను (2)
ఏమివ్వగలను యీ ప్రేమకు 
ఏమర్పించగలను నీ ప్రేమకు (2)
యేసుని స్వరూపాన్ని లోకానికి నే యిత్తును 
ప్రాణార్పణంగా క్రీస్తు కొరకే నే బ్రతికెద (2)

హృదయమే మోసమైనది ఆ వ్యాధినే కడిగివేసెను (2)
ఇంత గొప్ప నెమ్మది యేసు లోకానికిచ్చెను 
ఎంతో నూతన సృష్టిగా రూపాంతర పరిచెను (2)
ఏమివ్వగలను యీ  ప్రేమకు 
ఏమర్పించగలను నీ ప్రేమకు (2)
విరిగి నలిగిన హృదిని నే యిత్తును 
కడవరకు క్రీస్తు కొరకె  నే నిలిచెద (2)

-----------------------------------------------------
CREDITS : Music : JK Christopher
Vocals : Lillian Christopher
Lyrics,Tune : Rev.Elia Babu Jalli 
-----------------------------------------------------