** TELUGU LYRICS **
కలువరి గిరిలో నా కోసము
బలియైతివా నా యేసయ్య (2)
నా యేసయ్యా నా యేసయ్యా
నా కోసమే బలియైతివా (2)
||కలువరి||
నా శరీర పాప క్రియలకై
నీ శరీరమే ముద్దాయేనా
నా అపరాధ దోష క్రియలకై
నీవు అమ్మివేయబడితివా (2)
నీ ఆత్మ నాకు అనుగ్రహించుమా
నీ శక్తి నాకు దయచేయుమా (2)
నా యేసయ్యా నా యేసయ్యా
నా కోసమే మౌనివైతివా (2)
||కలువరి||
నా మోహపు తలంపులకై
నీ తలపైన ముండ్లమకుటమా
నా పాపపు చేతలకై
నీ చేతులలో శీలలా (2)
నీ తలంపులే నాకు అనుగ్రహించుమా
నీ చేతలే నాకు దయచేయుమా (2)
నా యేసయ్యా నా యేసయ్యా
నా కోసమే సహించితివా (2)
||కలువరి||
నా పాపపు నడతలకై
నీ కాళ్లలో మేకులా
నన్ను శుద్ధి చేయుటకై
నీ రక్తమంత కార్చితివా (2)
నీ మార్గములో నన్ను నడిపించుమా
పరిశుద్ధత నాకు దయచేయుమా (2)
నా యేసయ్యా నా యేసయ్యా
నా కోసమే త్యాగమైతివా (2)
||కలువరి||
------------------------------------------------------------------
CREDITS : Music : Bro. Siddu
Vocals : Bro. Siddu, Sis. Raji Lekhana
Lyrics, Tune : Sis. Ratna Leela Samarpana
------------------------------------------------------------------