** TELUGU LYRICS **
ప్రయోజనకరమైన నీ ప్రేమ పొందాలని పరితపిస్తున్న నా ప్రాణం
అమోఘమైన ఆనందం పొందాలని ఆరాటపడుతున్న నా అంతరంగం
శోధనలో నిన్ను స్మరియించుకొనుచు - నిందలలో నిత్యం నిన్నే స్తుతియిస్తూ
జీవితాంతం నీ కొరకే జీవిస్తానయ్యా
నా బ్రతుకంతా నీ కొరకే అర్పిస్తానయ్యా
అమోఘమైన ఆనందం పొందాలని ఆరాటపడుతున్న నా అంతరంగం
శోధనలో నిన్ను స్మరియించుకొనుచు - నిందలలో నిత్యం నిన్నే స్తుతియిస్తూ
జీవితాంతం నీ కొరకే జీవిస్తానయ్యా
నా బ్రతుకంతా నీ కొరకే అర్పిస్తానయ్యా
వేధనలలో వ్యర్థమైపోకుండా - కృంగినవేలలో కృప కొరకు కనిపెట్టుచూ
ఆశతో నిన్ను ఆరాధించి - సీయోను కొరకై సమర్పణ కలిగి
||జీవితాంతం||
అవమానాలను ఆశీర్వాదముగా - ఆస్వాదించిన ఆ సమయమందు
ఆనందంతో నను నింపినా - అభిషేకముతో అలంకరించిన
ఆనందంతో నను నింపినా - అభిషేకముతో అలంకరించిన
||జీవితాంతం||
విరిగి నలిగిన ఈ నా మనసుతో - మీకిష్టమైన బలియాగముగా
నీ సేవలోనే నే సాగిపోవుచూ - నమ్మకముగా నీ సాక్షిగా
||జీవితాంతం||
-----------------------------------------------------------
CREDITS : Music : Sareen Imman
Lyrics, Tune, Vocals : Krupa Madhurya
-----------------------------------------------------------