5662) దేవుని ఆశలు నీవే చెరిపేస్తే ఆ దేవుడే ఉగ్రరూపం దాలిస్తే

** TELUGU LYRICS **

దేవుని ఆశలు నీవే చెరిపేస్తే 
ఆ దేవుడే ఉగ్రరూపం దాలిస్తే 
ఆ క్రీస్తే సింహమై గర్జిస్తే
నిను రక్షించే చేతులే శిక్షిస్తే 
ఆ యేసుని దిక్కరిస్తే 
మిగిలేది పాతాళమందు శిక్షే 
అపుడేం లాభము నీవు రోధిస్తే 
లెక్కచేసావా యేసు బోధిస్తే
అపుడేం లాభము నీవు రోదిస్తే
లెక్కచేసావా సువార్త ప్రకటిస్తే

ఉన్నతమైన బ్రతుకును నీకిచ్చిందెందుకు 
జీవరాశులలో నీవే గొప్పైనందుకు (2) 
నీ వల్లే కలిగింది అవమానం చివరకు  
అందుకే వస్తుంది ప్రళయం నీ మీదకు (2) 
అపుడేం లాభము నీవు రోధిస్తే
లెక్కచేసావా యేసు బోధిస్తే 
అపుడేం లాభము నీవు రోధిస్తే 
లెక్కచేసావా సువార్త ప్రకటిస్తే

అందమైన ఈ లోకాన్ని నీకిచ్చిందెందుకు
దేవునికోపం దానిని అడవిగా మార్చినందుకు (2) 
దానిలో నీవు క్రూరమైన మృగమైనందుకు 
బలి కావాలి మూర్ఖులు క్రీస్తు రాకడకు (2) 
అపుడేం లాభము నీవు రోదిస్తే 
లెక్కచేసావా యేసు బోధిస్తే 
అపుడేం లాభము నీవు రోధిస్తే 
లెక్కచేసావా సువార్త ప్రకటిస్తే

ఎవరు రాగలరు నిన్ను రక్షించుటకొరకు 
ఎవ్వరికైనా వణుకే ఆ ఉగ్రత చూచుటకు (2) 
బ్రతికేటపుడే విలువివ్వాలి క్రీస్తు మాటకు 
విలువిస్తేనే చేర్చుకుంటాడు తండ్రి తన చెంతకు (2)

------------------------------------------------------------------------------
CREDITS : Vocals : Nycil. KK
Lyrics & Music : Philliph Prakash & Samuel Morris
------------------------------------------------------------------------------