5686) ఓరన్న వినరన్న ఓ మంచి వార్త నీ జీవితాన్ని మార్చేదే యేసయ్య వార్త

** TELUGU LYRICS **

ఓరన్న వినరన్న ఓ మంచి వార్త
నీజీవితాన్ని మార్చేదే యేసయ్య వార్త
ఎంత కాలమో అర్ధంలేని నీ జీవితం 
ఇంకెంత కాలమో వ్యర్థమైన నీజీవితం              
||ఓరన్న||

నీ బలమంత పాడు చేసే వేశ్యలతో
పాతాలానికి ఈడ్చుకు పోయే పాపముతో (2)
తల్లి బోధలను మరచి తండ్రి ఆజ్ఞలను విడచి (2)
బలముంది బలముంది అని బోల్తా పడ్డావా 
అయ్యో ఎయిడ్స్ అంటూ మంచాన పడ్డావా (2) 
||ఓరన్న||
 
నీ ధనమంత పాడు చేసే ఖైవిలలో తో
గౌరవ ఘనతలు గవినికి ఈడ్చేసారాయితో (2)
భార్య బిడ్డలను మరచి బజారు పాలు చేసి (2)
మత్తు మత్తుగా ఉందని మైకంలో పడ్డావా
అయ్యో క్యాన్సర్ అంటూ మంచాన పడ్డావా (2) 
||ఓరన్న||
 
నీ శాపమును విడిపించుటకు యేసయ్యా
కలువరి సిలువలో ప్రాణత్యాగమే చేసెను (2)
ఘోరపాపినైన క్షమియించే ప్రభువు (2)
చేతులు చాచి నీ కొరకు వేచి యుండెనుగా 
పరుగున వచ్చి గొప్ప రక్షణ పొందుకుంటావా (2)
||ఓరన్న||

---------------------------------------------
CREDITS : Vocals : Vagdevi 
Lyrics, Tune : Ps. Eesub Garu
---------------------------------------------