5685) చూపునిచ్చిన దేవుడు నిన్ను చూస్తున్నాడు

** TELUGU LYRICS **

చూపునిచ్చిన దేవుడు నిన్ను చూస్తున్నాడు
వినికిడినిచ్చిన తండ్రి నీ మాట వింటున్నాడు 
నడకనిచ్చిన ప్రభువు అడుగులు లెక్కపెట్టుచున్నాడు
అడుగడుగునా తన మాటలే ప్రకటించమంటున్నాడు 
జీవితమెచ్చిన దేవుడు తనకై బ్రతుక మంటున్నాడు  
జీవమునిచ్చిన దేవునికి అంకితమే అంటున్నాడు 
భద్రం జరభద్రం క్రైస్తవుడా జరభద్రం
||చూపునిచ్చిన||

సత్యము నిత్యము పరిశోధించగా
కంటికి దీపము చూపుని ఇవ్వలేదా 
లోకమే పాపమై నిన్ను లాగేనా 
వైభవం అనుభవం రమ్యమాయన 
నీ కన్ను చెడినది అయితే నీ దేహం అంతా చీకటి 
వెలిగాక ఆరిపోతే ఆ అంధకారమే గతి 
వేశ్యనే చూసి ఆశించు కన్ను ఆత్మేనే  కాల్చదా 
ఒకనాటి నీ పాపం నిలుచు ని కామం వెంటాడు మరణాంతరం 
||చూపునిచ్చిన||

నీ అంగిలి ఆహారమును రుచిచూచున్నట్లు 
నీ చెవి ప్రతి మాటను పరీక్షింపదా
చెప్పుడు మాటలు చెవిని పెట్టకు 
చక్కని బంధము చేజార్చుకోకు 
అబద్ధాల నాశ్రయించకు అందరిని పోగొట్టుకోకు
ముసలమ్మ ముచ్చట చాలు నీ తండ్రి వాక్యమే మేలు 
మందమైనా చెవి క్రొవ్విన  హృదయం నిన్ను కాల్చు కలకాలము
ఘనతకు ముందు వినయముండును వినుము ఇది సత్యమ 
||చూపునిచ్చిన||

సువార్తికుల పాదములు గిరులపై సుందరములు 
ఆ పాదము ఎప్పుడైననూ ను రాతికి తగుల బోదు 
పాప దారిలో పరుగు తీయకు పరలోకం చేరాలంటే 
బిలాము తప్పు త్రోవలో వడిగా పరిగెత్తకు 
అడుగులు తడబడనీయకు పాదాలు జారనీయకు
అడుగు నీ తండ్రిని నీ అడుగుల లెక్క ఎంత అని 
నీ చెంతకే చేరుటకు ఆ దూరం ఎంత ఉందని 
చేర్చుకో నా తండ్రిని నా పరుగు ముగించితి
||చూపునిచ్చిన||

------------------------------------------------------------------------
CREDITS : Lyrics : Dr. E. Santhosh Kumar
Vocals & Music : Nazeeruddin & Dharmashli K
------------------------------------------------------------------------