5691) నీవున్నావన్న ధైర్యముతో నే బ్రతుకుచున్న స్వామి

** TELUGU LYRICS **

నీవున్నావన్న ధైర్యముతో నే బ్రతుకుచున్న స్వామి 
నీవే లేని క్షణమున నేనసలే లేనయ్యా
నేటి వరకు కాపాడినది నీ కృప నేనయ్యా 
నీ కృప వీడి బ్రతుకుట నా తరమే కాదయ్యా
నీ స్మరనే లేకుండా నా మనుగడ లేదయ్యా 
నీ ఊసే లేకుండా నా శ్వాసే లేదయ్యా
||నీవున్నావన్నా||

వేదనలో ఆవేదనలో నా తోడుగున్నవయ్య 
బ్రతుకంతా భారమై నే కృంగిన వేళలో 
నా దరి చేరి నన్నాదరించిన నజరేయుడా
నీ ఆత్మతో నింపి నాకు శక్తిని నిచ్చావే 
నీ వాక్కును పంపి నన్ను బాగు చేశావే  
||నీ స్మరనే||

ఒంటరైన ఆ వేళలో నా జంటగున్నవయ్య
దిక్కు తోచని స్థితిలో నేను పడి ఉండగా 
నా దిక్కు నీవై నా దరి చేరిన నిజ దైవమా
నీ సన్నిధి నాకు చాలయ్య అదియే మేలయ్యా 
నీ సన్నిధిలోనె నాకు నెమ్మది గలదయ్యా 
||నీ స్మరనే||

విలువ లేని ఈ జీవితానికి విలువనిచ్చావయ్యా 
సిలువలో నీవు చేసిన ప్రాణ త్యాగమే 
నన్ను కోరి నన్ను పిలిచిన పరిశుద్ధుడా
నీ ప్రేమే నాకు చాలయ్యా అదియే మేలయ్యా
నీవు చాచిన రెక్కల నీడలో  దాచినవయ్యా
||నీ స్మరనే||

---------------------------------------------------
CREDITS : Sis. Asheervadamma
---------------------------------------------------