5690) నీ కోసమే నా యేసయ్యా అర్పింతును నా జీవితం

** TELUGU LYRICS **

నీ కోసమే నా యేసయ్యా
అర్పింతును నా జీవితం
నీ కోసమే నా యేసయ్యా
సమర్పింతును ఈ శేషజీవితం
యేసయ్యా నా జీవితం - పరిమళమై వికశించెనే
యేసయ్యా నా జీవితం - పరిమళమై పుష్పించెనే

ఒంటరిగా ఉన్న వేళలో - నా యవనములో నేనుండగా
తలంపులే వేదించగా - నా మదిలో కలత చెందగా
యోసేపుకు తోడై ఉన్నట్లుగా
నా యవనములో నాకు తోడుంటివే

దైర్యమే చెడి యుండగా
విశ్వాసమే బలహీనమవ్వగా
నీ వాక్యమే ఆదరించగా
విశ్వాస పరీక్షలో నే నిలువగా
అబ్రాహాము కలిగి ఉన్న విశ్వాస జీవితం
దీనుడైన నాకు దయ చేసితివే

ప్రాకారమే పడియుండగా
నా ఆత్మలో దుక్కించగా
పడిపోయిన ప్రాకారము 
మరల తిరిగి నిర్మించగా
నెహెమ్యా కలిగి ఉన్న ప్రార్థన జీవితం
అల్పుడనైన నాకు నేర్పించితివే

------------------------------------------------------------------
CREDITS : Music : Kiran
Lyrics, Tune, Vocals : A. Krupa Jyothi Babu
------------------------------------------------------------------