5689) నా సహకారివి నీవే నా కాపరి నీవే నా స్నేహితుడవు నీవే

** TELUGU LYRICS **

నా సహకారివి నీవే - నా కాపరి నీవే
నా స్నేహితుడవు నీవే - నా విమోచకుడ నీవే
యేసయ్యా వందనాలయ్యా
యేసయ్యా స్తుతి స్తోత్రములు

కాచితివి గత కాలము - నీ రెక్కల నీడలో
దరిచేర్చితివి ప్రతి అలల నుండి - బలమైన హస్తముతో
ఏ రీతి స్తుతియింతును - నీకేమి అర్పింతును 
(నా) కరములు చాపి నే - (నిను) ఆరాధించెదను

నేర్పితివి పలు పాటములు - నీ వాక్యపు వెలుగులతో
నడిపితివి తొట్రిల్లకుండా - ఆత్మీయ జ్ఞానముతో
ఏ రీతి స్తుతియింతును - నీకేమి అర్పింతును 
(నా) కరములు చాపి నే - (నిను) ఆరాధించెదను

చూపితివి మాదిరి మాకు - సీయోను చేరుటకే
వేచితిని ప్రభు రాకకై - నిరీక్షణ దైర్యముతో
ఏ రీతి స్తుతియింతును - నీకేమి అర్పింతును 
(నా) కరములు చాపి నే - (నిను) ఆరాధించెదను

-------------------------------------------------------------------
CREDITS : Music : Suresh Garu
Lyrics, Tune, Vocals : A. Krupa Jyothi Babu
-------------------------------------------------------------------