** TELUGU LYRICS **
భాదపడకు ఓ నేస్తమా - దిగులు చెందకు నీవిక
నా బ్రతుకు ఎందుకనీ - కలత నీవు చెందకుమా
కార్చిన కన్నీరు ప్రభువే చూచెనుగా
తగిన కాలములో కార్యము జరుగునుగా
నా బ్రతుకు ఎందుకనీ - కలత నీవు చెందకుమా
కార్చిన కన్నీరు ప్రభువే చూచెనుగా
తగిన కాలములో కార్యము జరుగునుగా
నే ఒంటరినని నా బ్రతుకు ఇంతేనని
వేదన నొందితివే - నలిగి వేసారితివే
ఎన్నికయే లేనివాడు బలమైనట్టి జనమగును
ఫలము లేదని పలుమార్లు కృంగితివే
తరిగెను కాలమని కన్నీరు కార్చితివే
మొదటి నీ స్థితి కొంచెమే
తుదకు మహావృద్ధి నొందెదవ్
నాకేల శ్రమలనీ భీతి చెందితివే
ఇంకెంత కాలమని బహువ్యాకులపడితివే
శోధన కొంతకాలమే - జయించిన జీవకిరీటం
-----------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Vocals : V. Victor Immanuyel
Tune & Music : Krupa Jyothi Babu & Suresh Garu
-----------------------------------------------------------------------------