5645) నీ రెక్కల నీడలో కాచితివి ఇంతకాలము

** TELUGU LYRICS **

నీ రెక్కల నీడలో కాచితివి ఇంతకాలము 
విలువైన నీ ప్రేమలో దాచితివి గతకాలము
అ.ప : ఉప్పొంగే నా హృదయం నూతన గీతముతో 
నే పాడి పొగడెదను స్తోత్రగీతముల్ (2)
||నీ రెక్కల||

గతమంత గాఢాంధకారమైన చేజారిన జీవితాన ఆవరించే మరణవేదన 
కలిగించితివి నిత్య నిరీక్షణ (2) 
విలువైన ప్రేమతో నడిపించినావు (2) 
దినములు జరుగుచుండగా
||ఉప్పొంగే||

ఆశలన్ని ఆవిరవుతున్న - చేరలేని గమ్యములోన చీకట్లు కమ్ముకుంటున్నా
నడిపితివి నీ వెలుగులోన (2) 
విలువైన ప్రేమతో నడిపించినావు (2) 
సంవత్సరములు జరుగుచుండగా
||ఉప్పొంగే||

అంధకార తుఫానులు ఉన్న అత్యున్నత నీ కృపలతోన మితిలేని నీ దయచేత
నిలిపితివి సంపూర్ణతలోన (2) 
విలువైన ప్రేమతో నడిపించెదవు (2) 
శాశ్వత కాలమువరకు
||ఉప్పొంగే||

--------------------------------------------------------------------------------------------
CREDITS : Lyrics : Rev Sanam Anil Kumar
Music, Tune & Vocals : Davidson Gujalavarthi & Sis. Sharon
--------------------------------------------------------------------------------------------