5646) నా అతిశయమా స్తుతి కారణమా స్తోత్రము చేసెదను

** TELUGU LYRICS **

నా అతిశయమా స్తుతి కారణమా స్తోత్రము చేసెదను
నా సైన్యము గా నిలిచిన దేవా ఆరాధించెదను (2)
మరువక మమతను చూపి మహిమ కిరీటము దయచేసి నావు 
మహిమలో నా స్థానమును పదిలముగా దాచి ఉంచావు
ఘనత మహిమ నీకే ఏసయ్యా 
బలము ప్రభావములు గల దేవా (2)
||నా అతిశయమా||

గత కాలములో నడచిన మార్గాన అపాయములను దాటించినావు
ఘనులకు లేని ఘనతను నాకు కిరీటముగా దయచేసినావు (2)
మేలు చేయుటలో నీవే సంపన్నుడవు ప్రభు
దారి చూపుటలో నీవే మార్గదర్శడవు
నీ కృపనే తలంచి పాడెద ఈ నూతన గీతమును 
నీ ప్రేమ రుచి చూచి పాడెద నా స్తోత్ర గీతమును (2)
||నా అతిశయమా||

నీ సేవలోనా ప్రతి విషయమందు నీ మహిమ చూపించినావు 
నీ మందసమున భుజమున మోయు భాగ్యము నాకిచ్చి నావు (2)
శోధన వలయమును నీవే తొలగించావు ప్రభు 
శాంతి వధనమును నాలో నిత్యము స్థాపించి 
నీ వాక్యం నా తోడై యుండగా ఘన విజయము నా సొంతమే 
నీ స్మరణే నాలోనే ఉండగా విహరింతును వైభవముగా (2)
||నా అతిశయమా||

సీయోను కొరకే నే వేచియున్నాను నా ఆశ తీర్చుము నా ప్రభువా 
నీ నిత్య రాజ్యాన నేనుoడుటకు సిద్ధము చేయుము నా దేవా (2)
లోకములో నుండి నన్ను ప్రత్యేకించితివి 
నీదు వరములోనే నాపై బహుగా నిలిపితివి 
నీ కొరకే ఫలించి సాగేద ఈ ఆత్మీయ యాత్రలో 
సీయోనే నా గురిగా నడచెదా తుదివరకు ఓపికగా (2)
||నా అతిశయమా||

--------------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune, Vocals, Music : Joseph KK
--------------------------------------------------------------------------------